కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన

హైదరాబాద్: తన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కించారని దాని తొలగించాలని కోరుతూ ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామపురానికి చెందిన గోకారి బికి సర్వే నంబర్ 416 లో ఎకరం భూమి ఉంది. అయితే  రెవెన్యూ అధికారులు దానిని ప్రభుత్వ భూమిగా రికార్డులోకి ఎక్కించారు. తన భూమిని అధికారులు తప్పుగా ప్రభుత్వ భూమిగా రాశారని, దానిని తన పేరు మీద మార్చాలని ఎన్నోసార్లు తహసీల్దార్‌, అదనపు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగింది. ఆయినా ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు.

దీంతో తన భూమిని తన పేర ఎక్కించాలని కోరుతూ ఇవాళ  కలెక్టరేట్​లోని అదనపు రెవెన్యూ కలెక్టర్ ఆఫీసుల ముందు పురుగుల మందును తాగడానికి ప్రయత్నించింది. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. బాధిత మహిళకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పారు.