పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం

పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం

పంజాబ్​లో 22 రైతులు సంఘాలు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. అన్నీ ఏకమై కొత్త రాజకీయ వేదిక 'సంయుక్త సమాజ్​ మోర్చా'ను స్థాపించాయి. వచ్చే ఏడాది జరిగే పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించిన పంజాబ్ రైతు సంఘాల నేతలు రాజకీయంపై ఫోకస్ చేశారు. పంజాబ్ ను గతిని మార్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. మొత్తం 32 రైతుల సంఘాలు పాల్గొనగా 22 రైతుల సంఘాల మాత్రమే  కలసి సంయుక్త సమాజ్ మోర్చాగా ఏర్పడ్డాయి. పంజాబ్ లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రజలు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు చండీగఢ్‌లో రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్.