మెదక్‌‌‌‌ జిల్లాలో బురదలో పడి ఊపిరాడక రైతు మృతి

కౌడిపల్లి,వెలుగు : పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు బురదలో పడడంతో ఊపిరాడక ఓ రైతు చనిపోయాడు. మెదక్‌‌‌‌ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన ముద్దం మల్లయ్య (65) తనకు ఉన్న రెండు ఎకరాల్లో వరిసాగు చేసేందుకు దుక్కి సిద్ధం చేశాడు. సోమవారం ఉదయం పొలంలో ఒడ్డు చెక్కే పనిచేస్తున్నాడు.

ఈ టైంలో పట్టు బారి ముందుకు పడిపోయాడు. దీంతో నోరు, ముక్కులోకి బురద పోవడంతోఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.