ఆరుగాలం కష్టపడి. పండించిన పంటకు గిట్టుబాటు ధర పలకపోతే కడుపు మండిన రైతు ఏం చేస్తాడు. ఈ రైతులాగే పంటను నాశనం చేస్తాడు. కళ్లెదుటే పంట నాశనం అవుతున్న గుండెలవిసేలా రోధిస్తూ లోలోపల కంటికి కనిపించని బాధ అనే శత్రువుతో యుద్ధం చేస్తాడు.
పంజాబ్ కు చెందిన అమృత్ సర్ లో హోల్ సెల్ కిలో కాలిప్లవర్ ధర రూ.75పైసలుగా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..,ఢిల్లీకి వెళ్లే రోడ్లు దిగ్బంధనం కారణంగా అమృత్ సర్ మరియు పరిసర జిల్లాల్లో కూరగాయల ధరలు చాలా వరకు తగ్గిపోయాయి.
సరిహద్దు గ్రామమైన సారాయ్‌కు చెందిన అజిత్ సింగ్ అనే రైతు కాలీప్లవర్ పడిస్తున్నాడు. భూమిని సాగు చేయడానికి మొలకలు,ఎరువులు, పురుగుమందుల కొనుగోలు కోసం సుమారు రూ .30వేల నుంచి 40వేల వరకు ఖర్చు చేశాడు. లక్షకు పైగా లాభం వస్తుందని ఆశించాడు. కానీ ఇప్పుడు అదే కాలిప్లవర్ కిలో రూపాయి కంటే తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే పంటను నాశనం చేయాలని నిర్ణయించుకున్నానంటూ బరువెక్కిన హృదయం తో చెబుతున్నాడు.
బీహార్ లోని సమస్తపూర్ జిల్లాలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన రైతు ఓంప్రకాష్ యాదవ్ 5 ఎకరాల్లో కాలిఫ్లవర్ పంటను వేశాడు. గిట్టుబాటు ధర పలకపోవడంతో..,కోతకు సిద్ధంగా ఉన్న పంటను ట్రాక్టర్ తో నాశనం చేస్తున్నాడు. 3.5 ఎకరాల పంటను నాశనం చేశా ఇంకా 1.5ఎకరాల పంట మిగిలి ఉంది. ఇలాంటి రోజు వస్తుందని నా జీవితంలో కూడా అనేకోలేదని వాపోతున్నాడు.
కాలీఫ్లవర్ సాధారణ ధర క్వింటాల్‌కు రూ.700 నుండి 1,500 రూపాయల వరకు ఉంటుందని, అయితే ఈ సీజన్‌లో ధరలు చూస్తుంటే వ్యవసాయం ఎందుకు చేస్తున్నాననో అర్ధం కావడం లేదన్నాడు.
టమోటాతో పాటు ఉల్లి ధర సుమారు ఒక్క రూపాయి కంటే తక్కువగా ఉండడంతో మరో ఇద్దరు రైతులు పంటను రోడ్లపై పారబోసి నాశనం చేస్తున్నారు. ప్రస్తుతం హృదయ విదారకర ఘటనలు కళ్లముందు కదలాడుతున్నాయి.
