ఫరీదాబాద్: మెట్రో స్టేషన్ బాల్కానిపై ఎక్కి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయబోతుంటే పోలీసులు చాకచక్యంగా అడ్డుకుని రక్షించారు. శనివారం సాయంత్రం జరిగిన ఘటన తాలుకు వీడియో వైరల్ అవుతోంది. ఫరీదాబాద్ లోని సెక్టర్ 28 మెట్రో స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేశారు. ఓ యువతి తమ స్టేషన్ బాల్కానిపైకి చేరుకుని కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి దిగుతోందని హడావుడిగా చెప్పాడు. సూసైడ్ చేసుకోబోయే ముందు ఏడుస్తూ.. బహుశా తన లవర్ తో చివరి సారిగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే స్థానిక స్టేషన్ సిబ్బంది, ప్రయాణికులు గమనించి సమాచారం ఇచ్చారు.
పోలీసులు హుటాహుటిన మెట్రో స్టేషన్ వద్దకు రాగా.. దూకేందుకు సిద్దమవుతున్న యువతితో మెట్రో స్టేషన్లోని ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై నుంచి..మాటల్లోకి దింపారు. స్టేషన్ కింద నుంచి ఎస్.ఐ ధన్ ప్రకాష్ మాటల్లో దింపారు. ఇంతలో కానిస్టేబుల్ సర్ఫరాజ్ పిట్టగోడపై చకచకా నడుచుకుంటూ వెళ్లి యువతిని గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంతలో ప్లాట్ ఫాంపై నుంచి మరో పోలీసు పిట్టగోడపైకి దూకి యువతిని గట్టిగా పట్టేసుకున్నారు. ఆమె విడిపించుకునేందుకు ప్రయత్నించగా.. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇద్దరు కలసి చెరో భుజం పట్టుకుని ఎత్తి.. పైన ప్లాట్ ఫైమ్ పైకి చేర్చగా అక్కడ రెడీగా ఉన్న సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా సదరు పోస్టు వైరల్ అవుతోంది. యువతిని మాటల్లో దింపి కాపాడిన కానిస్టేబుల్ సర్ఫరాజ్, ఎస్ఐ ధన్ ప్రకాష్, సీఐఎస్ఎఫ్ పోలీసు సిబ్బందిని పోలీసు కమిషనర్ ఓపీ సింగ్ అభినందించారు.
@FBDPolice @cmohry
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 25, 2021
फरीदाबाद पुलिस के सबइंस्पेक्टर धनप्रकाश और कॉन्स्टेबल सरफराज की बहादुरी,खुदकुशी के आमादा एक लड़को को मेट्रो स्टेशन पर कुछ इस तरह बचाया,लड़की काम को लेकर डिप्रेशन में थी pic.twitter.com/yEN5WJnA59
