మీరు ఏ పార్టీలోనైనా చేరవచ్చు: రజనీకాంత్

మీరు ఏ పార్టీలోనైనా చేరవచ్చు: రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ న్యూ ఇయర్ లో పార్టీ ప్రారంభిస్తాడంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ఇతర పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లో పాల్గొనలేనని రజనీకాంత్ చెప్పడంతో ఇన్నాళ్లు రజనీ మక్కళ్ మండ్రం తరఫున అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులు …తీవ్ర నిరాశకు గురయ్యారు. లేటెస్టుగా రజనీ మక్కళ్ మండ్రం నుంచి పలువురు నేతలు డీఎంకే పార్టీలో చేరారు.ఈ క్రమంలోనే రజనీకాంత్ టీం నుంచిఓ ప్రకటన వచ్చింది. మక్కళ్ మండ్రం నుంచి నేతలు ఇతర పార్టీల్లో చేరడంపై ఎలాంటి ఆంక్షలు లేవని… ఎవరికి ఇష్టమైన పార్టీలోకి వారు వెళ్లొచ్చని ఆ ప్రకటనలో ఉంది. అయితే ఏ పార్టీలో ఉన్నా రజనీకాంత్ అభిమానులమన్న విషయాన్ని వారు మర్చిపోకూడదని స్పష్టం చేశారు. ఈ వేసవిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. మరోవైపు ..రజనీ ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.