జపాన్​యానిమేటర్కు రామన్ మెగసెసె అవార్డ్స్​ 2024

2024 సంవత్సరానికిగాను ప్రముఖ జపాన్​ యానిమేటర్​ హయావో మియాజాకీని రామన్​ మెగసెసె అవార్డు వరించింది. ఆయనతోపాటు వియత్నాం డాక్టర్​ న్గుయెన్​, మాజీ బౌద్ధ సన్యాసికర్మ ఫుంట్​షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్​కు, థాయ్​లాండ్​కు చెందిన రూరల్​ డాక్టర్స్​ మూమెంట్​ సంస్థకు ఈ పురస్కారం దక్కింది. నవంబర్​లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. 

ఫిలిప్పీన్స్​ దివంగత అధ్యక్షుడు రామన్​ మెగసెసె స్మారకార్థం ఈ అవార్డును 1957, ఏప్రిల్​లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డును ఆసియన్​ నోబెల్​ ప్రైజ్​గా భావిస్తారు. 1958 నుంచి 2008 వరకు ఆరు విభాగాల్లో రామన్​ మెగసెసె అవార్డును అందజేశారు. 2009 నుంచి ఆరు విభాగాల్లో అవార్డులను ప్రదానం చేసే పద్ధతిని రామన్​ మెగసెసె అవార్డు ఫౌండేషన్​ విరమించుకున్నది. 

Also Read :- భారత్ లో వాయు కాలుష్యం 19శాతం తగ్గింది