కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్‌పై ED అధికారులు ఒత్తిడి తెచ్చి... కేరళ సీఎం వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు రికార్డు చేశారని కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ సీఎం పినరయి రవికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా గతేడాది ఆగస్టు 12,13 తేదీల్లో స్వప్న సురేష్‌పై ఒత్తిడి తెచ్చారని కేరళ పోలీసులు తెలిపారు.
