ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా మని మనస్థాపం చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపంతో సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ పరిధిలోని కొల్లూరు కు చెందిన విద్యార్థి సాయితేజ గౌడ్ (17) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సాయి తేజగౌడ్ మదీనగూడలోని శ్రీ చైతన్య కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు రాజుగౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు పోలీసులు. 

మరోవైపు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని హరిణి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి.. ఒక సబ్జెక్టు తప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలో కిటికీ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో విద్యార్థిని హరిణీ చనిపో వడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.