IPL 2025 Mega Action: కనీస ధరకు కష్టంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు RCB కెప్టెన్

ఐపీఎల్ మెగా ఆక్షన్ రెండో రోజు ప్రారంభమైంది. సోమవారం (నవంబర్ 25) జరుగుతున్న వేలంలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్ ను రూ. 2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. డుప్లెసిస్ ను కొనడానికి ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించకపోవడం విశేషం. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కనీస ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ రూపంలో ఆ జట్టు బలంగా కనిపిస్తుంది. డుప్లెసిస్ చేరడంతో ఆ జట్టు బలం పెరగనుంది. 

ఐపీఎల్ 2024 సీజన్ లో డుప్లెసిస్ బాగా ఆడినప్పటికీ అతని మీద బెంగళూరు జట్టు నమ్మకం ఉంచలేదు. రిటైన్ చేసుకోకుండా వేలంలో అతన్ని రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో రూ. 7 కోట్లకు ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈ సౌతాఫ్రికా ప్లేయర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అబుదాబి టీ20 లీగ్ లో అదరగొడుతున్నాడు. కెప్టెన్సీ అనుభవం ఉండడంతో డుప్లెసిస్ కి కెప్టెన్సీ ఇస్తారేమో చూడాలి.