IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్

ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు ఆక్షన్ హోరాహోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజ్‎లు కోట్లు కుమ్మరించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది. ఈ లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ లేడు. దీంతో అతనికి ఆర్సీబీతో మూడేళ్ళ ప్రయాణం ముగిసింది. తాజాగా డుప్లెసిస్, అతని భార్య ఎమోషనల్ పోస్ట్ చేశారు.

డుప్లెసిస్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఏడుస్తున్న ఫోటోను షేర్ చేశాడు. దీనికి అతని భార్య స్పందిస్తూ.. "3 సంవత్సరాల గొప్ప అనుభూతి ముగిసింది. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు ఆర్సీబీకి కృతజ్ఞతలు" అని ఆమె తెలిపింది. సోమవారం (నవంబర్ 25) జరిగిన  వేలంలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్ ను రూ. 2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. డుప్లెసిస్ ను కొనడానికి ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించకపోవడం విశేషం. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కనీస ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది.

Also Read : టాప్ ర్యాంక్‌కు చేరువలో జైశ్వాల్‌

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కు కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ రూపంలో ఆ జట్టు బలంగా కనిపిస్తుంది. డుప్లెసిస్ చేరడంతో ఆ జట్టు బలం పెరగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో డుప్లెసిస్ బాగా ఆడినప్పటికీ అతని మీద బెంగళూరు జట్టు నమ్మకం ఉంచలేదు. రిటైన్ చేసుకోకుండా వేలంలో అతన్ని రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో రూ. 7 కోట్లకు ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈ సౌతాఫ్రికా ప్లేయర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అబుదాబి టీ20 లీగ్ లో అదరగొడుతున్నాడు. కెప్టెన్సీ అనుభవం ఉండడంతో డుప్లెసిస్ కి కెప్టెన్సీ ఇస్తారేమో చూడాలి.  

వేలంలో బెంగళూరు కొన్న టాప్-5 ఆటగాళ్లు వీరే
 
జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్)

ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్)

జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్)

భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్)

లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్)