ఏది నిజం : రుషికొండపై ఉన్నది జగన్ ప్యాలెసా.. ప్రభుత్వ భవనమా..!

రుషికొండపై సీఎం జగన్ ప్యాలెస్ కడుతున్నాడంటూ ప్రతిపక్షాలు చాలా రోజులుగా ప్రచారం చేస్తున్నాయి. రుషికొండను సీఎం జగన్ ఆక్రమించేసాడని, రుషికొండకు గుండు కొడుతున్నాడని, పచ్చని చెట్లను నరికేసి ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఒక వర్గం మీడియాలో కూడా ప్రచారం చేస్తోంది. అయితే, వాస్తవానికి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. విశాఖను పరిపాలన రాజధానిగా నిర్ణయిచిన ప్రభుత్వం అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించాలని నిర్ణయించింది.

ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు భావన నిర్మాణం కోసం అక్కడ కొండను ఏ మాత్రం తవ్వట్లేదని, ఎప్పటినుంచో ప్రభుత్వ హయాంలో ఉన్న హరిత రిసార్ట్స్ భవనాలను పడగొట్టి నూతన రిసార్ట్స్ తో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టిందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నిర్మాణానికి గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా ఉందని తెలిపింది. జగన్ కబ్జా చేయటానికి అది ప్రైవేట్ ఆస్తి కాదని, ప్రభుత్వ ఆస్తి అని తెలిపింది.

ప్రభుత్వ స్థలంలో జగన్ సొంత భవనాన్ని ఎలా కట్టుకోగలడు, అసలు ప్రతిపక్షాలు ఈ ప్రచారానికి ఎలా తెర లేపాయో వారికే తెలియాలి. భావన నిర్మాణం పూర్తి కాకముందు ఒకరకంగా ప్రచారం చేస్తే, నిర్మాణం పూర్తయ్యాక క్యాంప్ ఆఫీస్, రిసార్ట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ప్రచారం మొదలు పెట్టారు. వాస్తవానికి క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి, టూరిజం భవనాల నిర్మాణం కోసం అయిన ఖర్చు 300కోట్లని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.