ప్రతి హాస్టల్​లో సౌకర్యాలు కల్పించాలి

  • వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ 

వికారాబాద్, వెలుగు:  జిల్లాలో ప్రతి హాస్టల్ లో పిల్లలకు తాగునీరు, టాయిలెట్స్, లైట్స్, ఫ్యాన్లు  తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని   కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్  కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు, హాస్టల్స్ వార్డెన్లతో  సమావేశం నిర్వహించారు.    హాస్టల్స్   రిపేర్లపై  దృష్టి పెట్టాలని, పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు.  విద్యార్థులకు మెనూ ప్రకారం  వండాలన్నారు.  సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డీఆర్డీఏ  శ్రీనివాస్  పాల్గొన్నారు.