ఫేస్ బుక్ ను వెంటాడుతున్న టిక్ టాక్ : కొత్త ఫీచ‌ర్ ను బిల్డ్ చేస్తున్న ‌సోష‌ల్ మీడియా దిగ్గ‌జం

ఫేస్ బుక్ ను వెంటాడుతున్న టిక్ టాక్ :  కొత్త ఫీచ‌ర్ ను బిల్డ్ చేస్తున్న ‌సోష‌ల్ మీడియా దిగ్గ‌జం

టిక్ టాక్ త‌రువాత షార్ట్ వీడియోను క్రియేట్ చేసేందుకు చాలా సంస్థ‌లు పోటీప‌డ్డాయి. కానీ టిక్ టాక్ అంతా ఆక‌ట్టుకోలేక‌పోతున్న‌ట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా టిక్ టాక్ త‌ర‌హాలో వీడియోను క్రియేట్ చేసేందుకు ఫేస్ బుక్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ లో షార్ట్ వీడియోస్ ను క్రియేట్ చేసేలా నెట్ వ‌ర్క్ ను డిజైన్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు.

2018యూఎస్ లో ఫేస్ బుక్ సంస్థ టిక్ టాక్ కు పోటీగా లాస్సో యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కానీ టిక్ టాక్ యాప్ దాటికి లాస్సో యాప్ నిలువ‌లేక‌పోయింది. ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైన లాస్సో యాప్ ను పూర్తిగా మూసివేస్తున్న‌ట్లు ఫేస్ బుక్ ప్ర‌క‌టించింది.

తాజాగా ఫేస్ బుక్ మ‌ళ్లీ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. టిక్ టాక్ మాదిరిగా షార్ట్ వీడియో టూల్స్ అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచ‌న‌కు ప‌దును పెట్టింది. అనుకున్న‌ట్లు విడిగా కాకుండా ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ లో షార్ట్ వీడియో టూల్ ను బిల్డ్ చేసే ప‌నిలో ఫేస్ బుక్ బిజీగా ఉంద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు.