ఫేస్ బుక్ కొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ బుక్ లో న్యూస్ ఫీడ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకున్న యూజర్లు ఎలాంటి సమస్య లేకుండా లాగిన్ చేసేందుకు పాస్ వర్డ్ లేకుండా లాగిన్ అవ్వొచ్చు.
ఫేస్ బుక్ లో న్యూస్ ఫీడ్, వీడియో కంటెంట్ పబ్లిష్ చేస్తుంటాం. ఆ లింక్ ను క్లిక్ చేస్తే డైరక్ట్ గా వెబ్ సైట్ లోకి , యూట్యూబ్ లో కి రీడైరక్ట్ అవుతుంది.
అయితే మనం ఫేస్ బుక్ నుంచి కొన్ని వెబ్ సైట్ల లో ప్రీమియం వెర్షన్ తీసుకునే సమయంలో పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది. ప్రతీసారి లాగిన్ అయినప్పుడల్లా ఆ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంది. ఈ ఆప్షన్ పై యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీసారి ప్రీమియం పాస్ వర్డ్ జనరేట్ చేయాలంటే కష్టంగా ఉందంటూ ఫేస్ బుక్ కు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్రమత్తమైన ఫేస్ బుక్ యాజమాన్యం కొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. న్యూస్ ఫీడ్ ప్రీమియం యూజర్లు పాస్ వర్డ్ లేకుండా ఆ ప్రీమియం తీసుకున్న యూజర్లకు డైరక్టర్ గా ఫేస్ బుక్ కు అటాచ్ చేస్తూ టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు పెరిగినట్లు ఫేస్ బుక్ ప్రకటించింది.
