చిన్న వ్యాపారులకు ఫేస్ బుక్ అండగా నిలువనుంది. చిన్న వ్యాపారుల కోసం ఫేస్ బుక్ ఇండియాలో కొత్త ప్రోగ్రామ్ ‘స్మాల్ బిజినెస్ లోన్ ఇనీషియేటివ్’ను లాంఛ్ చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో పేస్ బుక్ ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇందు కోసం ఫేస్ బుక్ ఇండిఫి(Indifi)అనే ఫైనాన్షియల్ సంస్థతో టై అప్ అయ్యింది. చిన్న వ్యాపారులు ఫేస్ బుక్ లో అడ్వర్టైజ్ చేస్తున్న చిన్న, మధ్యతరహా వ్యాపారులకు లోన్ ఇచ్చి వారి వ్యాపారాలను వృద్ధి చేయడంలో ఫేస్ బుక్ సహాయపడుతోంది.
