జట్టులోకి బుమ్రా వస్తాడా..?

జట్టులోకి బుమ్రా వస్తాడా..?

న్యూఢిల్లీ : శ్రీలంకతో మూడు టీ20లు, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌‌లకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ  సోమవారం ఇండియా జట్లను ఎంపికచేయనుంది. గాయం నుంచి కోలుకున్న  స్టార్ పేసర్ జస్‌‌ప్రీత్ బుమ్రా జట్టులోకి వస్తాడా? లేదా అనే విషయంపైనే అందరి ఫోకస్‌‌ నెలకొంది. ఇటీవల విశాఖ వేదికగా నెట్స్‌‌లో బుమ్రా బౌలింగ్‌‌ను టీమ్ ఫిజియో నితిన్ పటేల్, ట్రైనర్ నిక్ వెబ్‌‌ పరిశీలించారు. కానీ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌‌సీఏ) క్లియరెన్స్ ఇవ్వకపోవడం.. అతని రిహాబిలిటేషన్‌‌పై ఎన్‌‌సీఏ డైరెక్టర్ రాహల్‌‌ ద్రవిడ్ గుర్రుగా ఉండటంతో అతని ఎంపికపై అనుమానాలు నెలకొన్నాయి. పైగా జనవరి 14 నుంచి ఆసీస్‌‌తో వన్డే సిరీస్ ఉండటంతో అప్పటి వరకు రంజీల్లో ఆడించాలనుకుంటే మాత్రం శ్రీలంకతో టీ20 సిరీస్‌‌కు ఎంపిక చేయకపోవచ్చు. ఏ నిర్ణయమైనా కెప్టెన్‌‌ కోహ్లీపైనే ఆధారపడి ఉంది. ఇటీవల గాయపడ్డ దీపక్‌‌ చహర్ ఫిట్‌‌నెస్‌‌ను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధవన్‌‌కు అవకాశం దక్కకపోవచ్చు.