కళ్ల ఎరుపు వంటి సమస్యల నివారణకు​ ఐ– రిలాక్సింగ్​ కూలింగ్​ జెల్​ ప్యాడ్

కళ్ల ఎరుపు వంటి సమస్యల నివారణకు​ ఐ– రిలాక్సింగ్​ కూలింగ్​ జెల్​ ప్యాడ్

కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్లు పొడిబారడం, కళ్ల ఎరుపు వంటి సమస్యల నుంచి బయటపడేందుకు​ ఐ– రిలాక్సింగ్​ కూలింగ్​ జెల్​ ప్యాడ్​ ఇది. దీన్ని బోల్డ్​ హెల్త్​ కంపెనీ వాళ్లు తయారుచేశారు. ఈ ఐ–మాస్క్​ మగ, ఆడ ఇద్దరికీ పనికొస్తుంది. దీని స్ట్రాప్స్​ ఫ్లెక్సిబుల్​గా ఉంటాయి. దానివల్ల తల సైజ్​ను బట్టి అడ్జస్ట్​ చేసుకోవచ్చు. దీనికున్న ఎలాస్టిక్​ బాండ్​ మాస్క్​ను కదలనీయదు. ఈ ఐ మాస్క్​లో కూలింగ్​ జెల్​ కంప్రెషన్​ ఉంటుంది. దానివల్ల కోల్డ్​ కంప్రెస్​ థెరపీ ఇస్తుంది. దీన్ని వాడడం వల్ల ముఖానికి కూడా​ రిలీఫ్​. ఈ కూలింగ్​ మాస్క్​ను రిఫ్రిజిరేటర్​లో కొన్ని నిమిషాలు ఉంచి వాడాలి. రీ యూజబుల్​ మాస్క్ ఇది​. దీన్ని కోల్డ్​ కంప్రెస్​గానే కాకుండా హాట్​ కంప్రెస్​గా కూడా వాడొచ్చు.

కోల్డ్​ కంప్రెస్​

జెల్​ ఐ–మాస్క్​ వాడాలి అనుకున్న పావు గంట నుంచి అరగంట ముందు  రిఫ్రిజిరేటర్​లో ఉంచాలి. ఫ్రిజ్​లో పెట్టిన మాస్క్​ బాగా చల్లగా అనిపిస్తే దాన్ని పలుచటి బట్టలో చుట్టి అప్పుడు కళ్ల మీద పెట్టుకోండి.

హాట్​ కంప్రెస్​

జెల్​ ఐ మాస్క్​ను నీళ్లలో ఉంచి, ఐదు నుంచి పది నిమిషాలు మైక్రోవేవ్​లో పెట్టాలి. ఆ తరువాత దాని వేడి చూసుకున్నాకే వాడాలి. ఒక వేళ వేడి ఎక్కువ అనిపిస్తే పలుచటి టవల్​లో చుట్టి వాడాలి. జెల్​ ఐ – మాస్క్​ను కను రెప్పల మీద పెట్టుకుని పావుగంట నుంచి అరగంట ఉంటే రిజల్ట్​ ఉంటుంది.

ధర: 149 రూపాయలు