ఐ గేర్​ టార్గెట్​ రూ.1,230 కోట్లు

ఐ గేర్​ టార్గెట్​ రూ.1,230 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐ గేర్​ ఆప్టిక్స్​ 2027 నాటికి 150 మిలియన్​ డాలర్ల (రూ.1,230 కోట్ల) రెవెన్యూ అందుకోవాలని టార్గెట్​గా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్​ 35 మిలియన్​ డాలర్లు. ఈ కంపెనీ రెండు రౌండ్లలో ఏషియన్​ హెల్త్​కేర్​, వెంచర్​ ఈస్ట్​ల నుంచి 8.24 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ను పొందింది. హై క్వాలిటీ బ్రాండెడ్​ ప్రొడక్టులను రీజనబుల్​ రేట్లకే తాము అందిస్తున్నట్లు ఐ గేర్​ ఆప్టిక్స్​ ఎండీ రాజ్​ పైలా చెప్పారు. 

బెన్​ ఫ్రాంక్లిన్​, ఐ గేర్​ బ్రాండ్​ పేర్లతో ఆప్టిక్స్​ ప్రొడక్టులను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలో 500 హాస్పిటల్​ బేస్డ్​ ఆప్టికల్​ స్టోర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2,400 ఆప్టికల్​ రిటెయిలర్లతో జత కట్టామని, మరో 10 వేల మంది రిటెయిలర్లతో జత కట్టే ప్రయత్నాలలో ఉన్నామని రాజ్​ పైలా వివరించారు.  ప్రస్తుతం ఏటా 15 లక్షల మంది సేవలను అందిస్తున్నామని అన్నారు.