పోస్టల్  బ్యాలెట్  గడువు పెంపు

గద్వాల, వెలుగు: ఎలక్షన్​ డ్యూటీలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్  బ్యాలెట్  ద్వారా వినియోగించుకునేందుకు మరో రెండు రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు కలెక్టర్  సంతోష్  తెలిపారు. బుధవారం ఎన్నికల కమిషన్  ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఐడీవోసీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్  సెంటర్ లో ఈ నెల 10 వరకు పోస్టల్  బ్యాలెట్​ను అందించవచ్చని తెలిపారు.