ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లకు సెలవులు పొడిగింపు

ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లకు సెలవులు పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్లకు ఇచ్చిన శీతాకాలపు సెలవులను ప్రభుత్వం తాజాగా పొడిగించింది. చలిగాలుల కారణంగా గతంలో స్కూళ్లకు జనవరి 7 వరకు సెలవులు ఇచ్చారు. తాజాగా జనవరి 12 వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి తెలిపారు.  ఆదివారం ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. చలిగాలుల కారణంగా ఢిల్లీలోని స్కూళ్లు మరో ఐదు రోజులు క్లోజ్ చేస్తున్నట్లు అతిషి చెప్పారు.

నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు నిర్వహించకూడదని  పేర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. గవర్నమెంట్, గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్లు  ప్రైమరీ క్లాస్ విద్యార్థులకు స్కూళ్లు తరగతులు నిర్వహించకూడదని వెల్లడించింది. అవసరమైతే ఆన్ లైన్ పద్ధతిలో విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చని వివరించింది.