లాసెట్ దరఖాస్తుల గడువు పొడగింపు

తెలంగాణ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ ,పీజీ ఎల్సెట్ పరీక్షలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం..ఏప్రిల్ 15తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అభ్యర్థుల కోరిక మేరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 25 వరకు  దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. 


ఆదివారం నాటికి మూడేండ్ల లా కోసం 18,615 దరఖాస్తులు, ఐదేండ్ల లా కోసం 5,661, పీజీలాసెట్‌కు 2,294 చొప్పున మొత్తం 26,570 దరఖాస్తులొచ్చినట్టు సెట్‌ కన్వీనర్‌ బీ విజయలక్ష్మి తెలిపారు.కాగా జూన్ 3న లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.