కరోనావైరస్ యొక్క కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుండటంతో యూకే నుంచి వచ్చే మరియు యూకే వెళ్లే విమానాలపై భారత ప్రభుత్వం జనవరి 7 వరకు నిషేధం విధించింది. ‘యూకేకు వెళ్లే మరియు యూకే నుంచి వచ్చే విమానాలను జనవరి 7, 2021 వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించబడింది. ఆ తర్వాత కఠినమైన నిబంధనల మధ్య మళ్లీ రాకపోకలు ప్రారంభమవుతాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.
యూకే విమానాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధిస్తున్నట్లు ఆయన డిసెంబర్ 23న ప్రకటించారు. కానీ, కొత్త రకం వైరస్ వ్యాప్తి దృష్ట్యా నిషేధాన్ని మరింతకాలం పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన 20 మంది ఈ కొత్త రకం వైరస్ బారినపడ్డారు.
For More News..
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు
అక్రమాస్తుల కేసులో పాక్ మాజీ మంత్రి అరెస్ట్
‘ములాగ్’ మెడల్ సాధించిన ఏకైక క్రికెటర్
