న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 25.54 శాతం పెరిగి 1.15 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. క్రితం ఏడాది ఇదేకాలంలో ఎగుమతుల విలువ 922 మిలియన్ డాలర్లు ఉంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల విలువ కూడా జూన్ క్వార్టర్లో 5 శాతం పెరిగి 1.56 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 31 శాతం పెరిగి 7.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) ద్వారా 23.56 బిలియన్ డాలర్ల విలువైన అగ్రికల్చరల్, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయాలని టార్గెట్విధించారు. ఈ ఉత్పత్తులలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉన్నాయి. " ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో మాంసం, పాడి, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 9.5 శాతం పెరిగాయి. డెయిరీ ప్రొడక్టుల ఎగుమతుల విలువ 67.15 శాతం పెరిగి 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
