శివ్వంపేట మండలంలో ఎక్సైజ్ ఆఫీసర్ల తనిఖీలు

శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలంలో గంజాయి అమ్మకాలపై ' గుప్పు  మంటున్న గంజాయి' శీర్షికతో మంగళవారం  'వెలుగు' పేపర్​లో వచ్చిన వార్తకు ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్ స్పందించింది.  మంగళవారం ఎక్సైజ్ టాస్క్​ ఫోర్స్​ సీఐ నరేందర్ సిబ్బందితో కలిసి  మండలంలోని శభాష్ పల్లి శివారులో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫీడ్ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు.  

కంపెనీలో పనిచేసే ఇతర రాష్ట్రాల లేబర్లు గంజాయికి అలవాటు పడొద్దని సూచించారు. అనంతరం శివ్వంపేట, గోమారం, దొంతి, చండి, చెన్నాపూర్ గ్రామాల్లో  గంజాయి సరఫరా, అమ్మకాలపై ఎంక్వైరీ చేశారు.