ప్రశాంతంగా ముగిసిన సీడీపీవో పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీవో) పోస్టులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఖాళీల భర్తీకి గాను మొత్తం 19,812 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 ఈ నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ నెల 3న రెండు షిఫ్టుల్లో నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 4,169 మంది, పేపర్ 2కు 4,155 మంది హాజరయ్యారు. శనివారం నిర్వహించిన పేపర్ 1పరీక్ష కు 3,799, పేపర్ 2కు 3,787 మంది అటెండ్ అయ్యారు.