కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత మాణిక్‌ రావు(87) గవిత్‌ కన్నుమూశారు.  వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నాసిక్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1980లో రాజకీయాల్లోకి వచ్చిన గవిత్‌... నందుర్‌బార్ నియోజకవర్గం నుండి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గవిత్ 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా, 2013లో సామాజిక న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. లోక్ స‌భ తాత్కాలిక స్పీక‌ర్ గా కూడా ఆయన ప‌నిచేశారు. మాణిక్‌ రావుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు బీజేపీలో, కుమార్తె శివసేనలో ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గవిత్‌ అంత్యక్రియలు ధూళిపాడులోని ఆయ‌న వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి.