ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ ముగిసింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ కు సంబంధించి యంగ్ ఇండియా సంస్థకు విరాళం కేసులో దాదాపు రెండు గంటల పాటు ఈడీ విచారణ జరిపింది. ఈడీ విచారణ అనంతరం మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్.. ఈడీ కాంగ్రెస్ నాయకులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. యంగ్ ఇండియా సంస్థకు 20 లక్షలు విరాళం ఇచ్చానని చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని లెక్కలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు.
ఈడీ అడిగిన అడిగిన పత్రాలను మెయిల్ చేస్తానని.. వాళ్ళు రిసిప్ట్ కూడా ఇచ్చారని చెప్పారు. తాను ఎంపిగా పనిచేశానని.. తనకు పెన్షన్ కూడా వస్తోందన్నారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్దమని అన్నారు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలేసి... బడుగు బలహీనర్గాలపై ఈడి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు అంజన్ కుమార్ యాదవ్.
ALSO READ :
