చంద్రబాబు చేసిన పాపాలు, ఘోరాలే ఆయన్ను వెంటాడుతున్నాయి: పేర్ని నాని

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను చేసిన పాపాలు, ఘోరాలే చంద్రబాబును వెంటాడుతున్నాయన్నారు... కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన  చంద్రబాబు...   కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం నిరసన తెలిపితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వేధించారని తెలిపారు.  చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారు.

నిన్న ( సెప్టెంబర్ 30) అంతా నవ్వుకుంటూ విజిల్స్, డప్పు మోత మోగించారిన పేర్నినాని అన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఆనందంగా డప్పు కొట్టారు.. టీడీపీ నేతల్లో ఆనందం తాండవిస్తోంది.. ఎవరిలోనూ కొంచెం కూడా బాధ కనిపించ లేదు.. . టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. లంచాలు తినేసి కంచాలు మోగిస్తున్నారు అని పేర్నినాని అన్నారు. టీడీపీ పార్టీకి కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పే పార్టీ కేడర్ ఎక్కడికి పోయింది అని పేర్నినాని ప్రశ్నించారు. చంద్రబాబు జనం సొమ్ము నొక్కేశారని అందరు అనుకుంటున్నారు..

అమరావతి స్కాం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కాంలో  చంద్రబాబు భారీగా వెనకేసుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్‌ ఢిల్లీ వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని లోకేష్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై కేసులు ఉంటే లోకేష్‌ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. లోకేష్‌కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధమవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.