కేసీఆర్ కనిపించడం లేదు..గజ్వేల్ పీఎస్లో కంప్లైంట్

మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు. పోలీసులు వారం రోజుల్లో కేసీఆర్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. 

Also Read :- కాళేశ్వరం కేసీఆరే కట్టిండు..ఆయన కళ్ల ముందే కూలింది

 రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో పోరాడాలన్నారు.  కేసీఆర్ ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం రావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.  పోలీసులు  వారం రోజుల్లో కేసీఆర్ ఆచూకీ కనిపెట్టకపోతే ..తామే కేసీఆర్ ను వెతికే కార్యక్రమాలు చేస్తామన్నారు.