తృణమూల్ కాంగ్రెస్‌‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా

తృణమూల్ కాంగ్రెస్‌‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ‌లో చేరారు. బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ యశ్వంత్ టీఎంసీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తిని రేపుతోంది. బీజేపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీపై సిన్హా దుమ్మెత్తిపోస్తున్నారు. తృణమూల్‌లో చేరిన అనంతరం సిన్హా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ బలహీనపర్చిందన్నారు. ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదన్నారు. ఎన్నికల క్యాంపెయినింగ్‌‌లో గాయపడిన మమతా బెనర్జీపై సానుభూతి చూపకుండా ఆమెపై బీజేపీ నేతలు జోకులు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.