ప్రతి ఒక్కరూ గోవును కాపాడుకోవాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

బషీర్ బాగ్, వెలుగు:  గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీసీ సంక్షేమ శాఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. గో రక్షణ కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మహాపాద యాత్ర నిర్వహించిన బాలకృష్ణ గురు స్వామి ఆదివారం నగరానికి చేరుకోగా,  బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ లోని అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. మినిస్టర్ క్వార్టర్స్ తో పాటు తన ఊరిలో కూడా ఆవులను పెంచుతున్నట్లు తెలిపారు. గో రక్షణ కోసం పాదయాత్ర చేసిన బాలకృష్ణ గురుస్వామిని అభినందించారు. బాలకృష్ణ మాట్లాడుతూ 87 రోజుల్లో 2600 కిలోమీటర్లు 9 రాష్ట్రాలు తిరిగినట్లు చెప్పారు. బషీ‌‌‌బాగ్ అమ్మవారి ఆలయం నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు ఆవులతో కలిసి గురుస్వామి బాలకృష్ణ పాదయాత్రగా వెళ్లారు.