కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీ్ట్ చేశారు. రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5వేల రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన 'ఇందిరమ్మ అభయం' పథకం యాప్‌ను లాంఛ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపర్చడం జరిగింది. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ పథకం అమలు కావాంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించింది అంటూ షర్మిల ట్వీట్ చేసింది.
రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5వేల రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన 'ఇందిరమ్మ అభయం' పథకం యాప్‌ను లాంఛ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపర్చడం జరిగింది. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ పథకం అమలు… pic.twitter.com/nSE1w4QQ1l
— YS Sharmila (@realyssharmila) March 10, 2024