కళాశాల విద్యాశాఖ ఇన్​చార్జ్​ కమిషనర్​గా నర్సింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కళాశాల, సాంకేతిక విద్యా శాఖలకు ఇన్​చార్జ్​  కమిషనర్​గా ఈవీ నర్సింహారెడ్డిని సర్కారు నియమించింది. ఈ మేరకు సీఎస్  శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుత కమిషనర్​గా ఉన్న శ్రీదేవసేన ఈనెల 6 నుంచి 25 వరకు సెలవులో వెళ్లారు. దీంతో ఆమె వచ్చే వరకు ఆయా బాధ్యతలను స్కూల్  ఎడ్యుకేషన్ డైరెక్టర్​గా ఉన్న నర్సింహారెడ్డికి అప్పగించారు. సెలవులోంచి తిరిగి రాగానే.. శ్రీదేవసేన తన బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.