ఈ కాఫీ తాగితే.. మతిమరుపు రాదు.. బాగా గుర్తుంటాయి

ఈ కాఫీ తాగితే.. మతిమరుపు రాదు.. బాగా గుర్తుంటాయి

కాఫీ తాగితే చాలా ప్రయోజనాలుంటాయని చెప్పడం వింటూ ఉంటాం. కానీ దాని వల్ల మతిమరుపు కూడా రాదని మీకు తెలుసా..? ఇంతకీ ఆ కాఫీ పేరు ఏంటో తెలుసా. అదే.. ఎస్ప్రెస్సో కాఫీ. దీన్ని సేవించడం వల్ల అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా నివారించవచ్చని ACS' జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. అంతే కాదు ఇతర న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు వ్యతిరేకంగా కూడా ఇది పనిచేస్తుందట.

ఇటాలియన్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో.. ఎస్ప్రెస్సో కాఫీ వల్ల అనేక ఉపయోగాలుంటాయని.. అందులో భాగంగా ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చేందుకు తోడ్పడుతుందట.

ఎలా తయారు చేస్తారంటే..

అనేక రకాల కాఫీ గింజలతో ఎస్ప్రెస్సో కాఫీని తయారు చేస్తారు. ఎస్ప్రెస్సో అనేది దక్షిణ ఐరోపాలో , ముఖ్యంగా ఇటలీ , ఫ్రాన్స్ , స్పెయిన్, పోర్చుగల్ తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా ప్రజాదరణ పొందింది. అయితే సాధారణ కాఫీతో పోల్చితే ఇందులో కెఫీన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సాధారణ పద్దతుల ద్వారా తయారుచేసిన కాఫీ కంటే ఇది కొంచెం మందంగా ఉంటుంది. అంతే కాదు ఇది మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది.