ఫ్లాట్​గా నిఫ్టీ .. సెన్సెక్స్ 165 పాయింట్లు అప్​

ఫ్లాట్​గా నిఫ్టీ .. సెన్సెక్స్ 165 పాయింట్లు అప్​

ముంబై : ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సూచనలు హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, టీసీఎస్,  రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ఇండెక్స్ హెవీవెయిట్‌‌లలో భారీ కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్ బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ మంగళవారం లాభపడింది. నిఫ్టీ మాత్రం పెరగలేదు. సెన్సెక్స్ 165.32 పాయింట్లు శాతం పెరిగి 73,667.96 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 501.52 పాయింట్లు పెరిగి 74,004.16 వద్దకు చేరుకుంది. నిఫ్టీ దాదాపు ఫ్లాట్‌‌గా 3.05 పాయింట్లు పెరిగి 22,335.70 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీలలో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ 2 శాతానికి పైగా పెరిగింది.

టీసీఎస్, మారుతీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌‌టెల్ షేర్లు లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేఎస్‌‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే వంటి కంపెనీలు వెనుకంజ వేశాయి. బీఎస్‌‌ఈ స్మాల్‌‌క్యాప్ గేజ్ 2.11 శాతం క్షీణించగా, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 1.31 శాతం క్షీణించింది. సెక్టోరల్ ఇండెక్స్‌‌లలో రియాల్టీ 3.53 శాతం, ఇండస్ట్రియల్స్ 1.74 శాతం, కమోడిటీస్ 1.73 శాతం, సర్వీసెస్ 1.70 శాతం, యుటిలిటీస్ 1.59 శాతం, మెటల్ 1.34 శాతం క్షీణించాయి. ఐటీ, టెక్ మాత్రమే లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225 0.1 శాతం నష్టపోగా, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయింది. హాంకాంగ్‌‌కు చెందిన హ్యాంగ్‌‌సెంగ్‌‌ 3.1 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.8 శాతం పురోగమించాయి.