గుడ్ న్యూస్: ఎప్పుడంటే అప్పుడు డబ్బు విత్​డ్రా!

  • ఈపీఎఫ్​ఓ, ఈఎస్​ఐసీ మెంబర్లకు ఈ–వాలెట్లు 

న్యూఢిల్లీ : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్​ఐసీ), ఎంప్లాయీస్ ​ప్రావిడెంట్ ​ఫండ్​ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్​ఓ) మెంబర్లు త్వరలో క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మొత్తాలను ఈ–-వాలెట్ల ద్వారా తీసుకోవచ్చు.  కేంద్ర కార్మిక  ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా  మాట్లాడుతూ  మెంబర్లు డబ్బును మరింత సులభంగా విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడానికి వారి ఖాతాలకు ఈ–వాలెట్లను లింక్ ​చేస్తామని ప్రకటించారు. 

ALSO READ : భారీగా జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ మోసాలు..రూ.26,543 కోట్ల ఎగవేత

ఆటో సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విషయంలో డబ్బు బ్యాంకు ఖాతాకు వెళ్తుందని, ఎప్పుడైనా బ్యాంకు నుంచి విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవచ్చని దావ్రా చెప్పారు.  ఇదిలా ఉంటే అధిక పింఛను కోసం వివరాలను అందించేందుకు వచ్చే నెల 31 వరకు గడువును పెంచినట్టు ఈపీఎఫ్​ఓతెలిపింది.