ఏడుపాయల వేలం ఆదాయం రూ.2.38 కోట్లు

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గా భవానీ మాత ఆలయానికి వేలం ద్వారా రూ.2 కోట్ల 38 లక్షల 80 వేల ఆదాయం సమకూరినట్లు బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి,  ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కొబ్బరి బోండాలు విక్రయించుకొనే హక్కు రూ.కోటి  11లక్షల 20వేలకు మెదక్ పట్టణానికి చెందిన లింగోజీ,  ఒడి బియ్యం పోగుచేసుకునే హక్కు రూ. కోటి 9లక్షల 50వేలకు నాగ్సానిపల్లికి చెందిన జీవన్ రెడ్డి,  పూజ సామగ్రి విక్రయాల హక్కు రూ.17లక్షలకు నాగ్సాన్ పల్లికి  చెందిన బుడాల నర్సింలు దక్కించుకున్నారు. 

కార్యక్రమంలో టెండర్ దారులు, ఆలయ సిబ్బంది శ్యామ్,  శ్రీనివాస్, శ్రీనివాస్ శర్మ, ప్రతాప్ రెడ్డి, యాదగిరి, నర్సింలు, నరేశ్, మహేశ్ పాల్గొన్నారు.