మూడో టెస్ట్‎లో తడబడిన ఇంగ్లండ్‌..‌‌‌‌‌‌‌ 143 పరుగులకే ఆలౌట్‌‌‌‌‌‌‌‌

హామిల్టన్‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో తడబడింది. కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు మ్యాట్‌‌‌‌‌‌‌‌ హెన్రీ (4/19), విల్‌‌‌‌‌‌‌‌ ఓ రౌర్కి (3/33), శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (3/7) చెలరేగడంతో.. ఆదివారం రెండో రోజు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 35.4 ఓవర్లలో 143 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. జో రూట్‌‌‌‌‌‌‌‌ (32) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (27), ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (24), జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ (21)తో సహా అందరూ ఫెయిలయ్యారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన కివీస్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 32 ఓవర్లలో 136/3 స్కోరు చేసింది. విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (50 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), రాచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (2 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (60) రాణించాడు. మొత్తానికి 204 పరుగుల తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంతో కలుపుకుని కివీస్‌‌‌‌‌‌‌‌ ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 340 రన్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.