England Cricket: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టు

147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో 5 లక్షల పరుగులు పూర్తి చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. 147 ఏళ్లలో ఇంగ్లీష్ జట్టు 1,082 టెస్టులు ఆడింది. 

ఈ జాబితాలో  4 లక్షల 28 వేల 794 పరుగులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా..  586 టెస్టుల్లో 2 లక్షల 78 వేల 700 పరుగులతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 

అత్యధిక సెంచరీల రికార్డు వారిదే

ఇంగ్లండ్ జట్టు మరో రికార్డు సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా అవతరించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇప్పటివరకు 929 సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు 892 సెంచరీలు చేశారు. ఇక భారత బ్యాటర్లు 552 సెంచరీలు చేశారు.

ALSO READ : NZ vs ENG: న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన RCB యువ బ్యాటర్