ఇండియా ఉండాల్సిందే : రిచర్డ్‌‌‌‌ థాంప్సన్‌‌‌‌

న్యూఢిల్లీ : టీమిండియా లేకుండా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీని నిర్వహించడం కరెక్ట్‌‌‌‌ ఎంపిక కాదని ఇంగ్లండ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు చైర్మన్‌‌‌‌ రిచర్డ్‌‌‌‌ థాంప్సన్‌‌‌‌ అన్నాడు. ‘ఇండియా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీలో ఆడకపోవడం క్రికెట్‌‌‌‌ ప్రయోజనాలకు మంచిది కాదు. జై షా రావడానికి ముందే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారో చూడాలి. ఒకవేళ ఇండియా లేకుండా చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ ఆడితే ప్రసార హక్కులను కోల్పోవాల్సి వస్తుంది.

పాక్‌‌‌‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. ఇండియా రావాలని వాళ్లు గట్టిగా కోరుకుంటున్నారు. అది జరగకపోతే భిన్నమైన ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయి. సరైన టైమ్‌‌‌‌లో వాటి గురించి వాళ్లతో చర్చిస్తాం’ అని థాంప్సన్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.