మందు కొట్టి కారు డ్రైవింగ్.. పల్టీలు కొట్టి ఇంజినీరింగ్ స్టూడెంట్ మృతి

వీకెండ్ పార్టీ విషాదం అయ్యింది. ఇంజినీరింగ్స్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుని వస్తుండగా.. కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ యాక్సిడెంట్ లో 21 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ చనిపోవటం హైదరాబాద్ సిటీలో విషాదంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి బోగారంలో హోలీ మేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి రాజేందర్ తన స్నేహితులు విశ్వ, యశ్వంత్ లతో కలిసి వీకెండ్ పార్టీకి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కి తరలించారు. కారులో మద్యం బాటిల్స్ లభించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.