ENG vs WI: బట్లర్‌‌‌‌ మెరుపులు.. ఇంగ్లండ్‌ విజయం

బ్రిడ్జ్‌‌టౌన్‌‌: కెప్టెన్ జోస్ బట్లర్ (45 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 83) ధనాధన్ బ్యాటింగ్‌‌తో సత్తా చాటడంతో వెస్టిండీస్‌‌పై ఇంగ్లండ్‌‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విండీస్‌‌ను ఓడించి ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 2–0తో ఆధిక్యం సాధించింది. 

వన్‌‌సైడ్ పోరులో తొలుత విండీస్ 20 ఓవర్లలో 158/8 స్కోరు చేసింది. కెప్టెన్ రోవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (43), రొమారియో షెఫర్డ్‌‌ (22) టాప్‌ స్కోరర్లు. సకీబ్‌‌ మహ్మూద్‌‌, లియామ్‌‌ లివింగ్‌‌స్టోన్‌‌, డాన్ మౌస్లే తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బట్లర్ మెరుపులతో ఇంగ్లండ్ 14.5 ఓవర్లలోనే 161/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. బట్లర్‌‌‌‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​ అవార్డు లభించింది. మూడో టీ20 శుక్రవారం రాత్రి జరుగుతుంది.