ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాక్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై ఇప్పటికే చర్చ మొదలైన విషయం తెలిసిందే. పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. స్వింగ్ సంగతి దేవుడెరుగు బంతి బౌన్స్ కూడా అవ్వడం లేదు. ఈ పిచ్‌పై ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ.. ముల్తాన్ పిచ్ బౌలర్ల పాలిట శ్మశాన వాటికని విమర్శించాడు. ఇలాంటి పిచ్‌పై పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం అభిమానులకు విసుగొచ్చేలా బ్యాటింగ్ చేశాడు.
253 పరుగుల భాగస్వామ్యం
రెండో వికెట్‍కు అబ్దుల్లా షఫీక్(102), షాన్ మసూద్ (151)ల జోడి 253 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ స్వల్ప పరుగుల తేడాతో పెవిలియన్ చేరగా.. క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజం(30), సౌద్ షకీల్(35 నాటౌట్) తమ డిఫెన్స్‌తో అభిమానులకు విసుగు పుట్టించారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై వీరిద్దరూ టుక్ టుక్ బ్యాటింగ్ చేశారు. ఆ దృశ్యాలను చూడలేక ఓ అభిమాని కనివితీరా నిద్రపోయాడు. చివరకు పాక్ మాజీ కెప్టెన్ ఫోర్ కొట్టినా నిద్ర లేవలేదు. ఆ సన్నివేశాలను కెమెరామెన్ పదే పదే స్క్రీన్‌పై చూపెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Pakistan fans in Multan today ???
— Farid Khan (@_FaridKhan) October 7, 2024
Wake up, guys. Babar Azam is batting ?#PAKvENG #tapmad #DontStopStreaming pic.twitter.com/BWBJi5dzuP
ఇక తొలి రోజు అట ముగిసే సమయానికి పాక్ 4 వికెట్లు నష్టపోయి 328 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌద్ షకీల్(35 నాటౌట్), నసీం షా(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ALSO READ | Hong Kong Sixes 2024: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్, పాక్ జట్లు