జీతాలు చెల్లించలేం: 600మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఎయిర్ లైన్ సంస్థ

జీతాలు చెల్లించలేం: 600మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఎయిర్ లైన్ సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అన్నీ రంగాల్ని చిన్నాభిన్నం చేస్తుంది. దీంతో ఆయా సంస్థలు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక వారిని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఎమిరేట్స్ సుమారు 600మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ లో 60వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తుంది. ఇప్పటికే 192మందిని ఉద్యోగుల్ని తొలగించిన ఏవియేషన్ సంస్థ.. తాజాగా 600మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో వారి సంఖ్య 792కి చేరింది.

కరోనా కారణంగా అన్నీ రంగాల కంటే ఏవియేషన్ రంగంపై భారీ ప్రభావం ఉందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక.. వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ లైన్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.