ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్లు నష్టం

ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్లు నష్టం

ఒక్క ట్వీట్ తో 14 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశారు ఎలాన్ మస్క్. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈవో తాజాగా ఓ ట్వీట్ తో భారీనష్టాల్ని చవిచూడడమే కాదు..సీఈఓ పదవి కోల్పోతారని వార్తలు వస్తున్నాయి.

కొంప ముంచిన ట్వీట్

యుఎస్ స్టాక్ మార్కెట్ లో టెస్లా మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. దీనికి అనుసంధానంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా కంపెనీ షేర్లు కాస్తంత ఎక్కువగానే ఉందని ట్వీట్ చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. దీంతో టెస్లా కంపెనీ 14బిలియన్ డాలర్లు నష్టపోయింది. అందులో ఎలాన్ మస్క్ 3బిలియన్ డాలర్ల ను నష్టాల్ని మూటగట్టుకున్నారు.

అలవాటులో పొరపాటు 

ఇలా ట్వీట్ చేయడం ఎలాన్ మస్క్ కు అలవాటే. 2018లో టెస్లా చైర్మన్ గా ఉన్న ఎలాన్ ఒక్క ట్వీట్ తో ఆ పదవిని కోల్పోయి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

పబ్లిక్ లిమిటెడ్‌ సంస్థగా ఉన్న టెస్లాను పూర్తిగా సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నానని, అందుకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకున్నట్టు ఎలాన్ మస్క్ 2018 ఆగస్టు నెలలో  ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై టెస్లా షేరు విలువ ఒక్కొక్కటి 420 డాలర్లు అవుతుందని చెప్పారు. ఆ ట్వీట్ల అనంతరం కంపెనీ షేర్ల విలువ అమాంతంగా పెరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ పడిపోయింది.  ఆయన చేసిన ఆ ట్వీట్లు ఎస్‌ఈసీ తప్పుపట్టింది.  నిజానికి మస్క్ ఎటువంటి నిధులు సమకూర్చే సంస్థతోనూ.. ఒప్పందం ఖరారు చేసుకోవటం .. కంపెనీ ధర, విధివిధానాల వంటి కీలక అంశాలపై అసలు చర్చించనేలేదు అని పేర్కొంది.