న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ రోజురోజుకీ మరింత ధనవంతుడవుతున్నారు. టెస్లా షేర్లు పెరడగడంతో వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్‌లో మస్క్ టాప్–5 చోటు సంపాదించారు. దీంతో ఈ లిస్ట్‌లో నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్లేస్ కోల్పోయారు. మస్క్ ఆదాయం 74 బిలియన్లను దాటింది. ఫోర్బ్స్ లిస్ట్‌లో ఉన్న వారెన్ బఫెట్, ముఖేశ్ అంబానీ సరసన మస్క్ చోటు సంపాదించాడు. టెస్లా షేర్ ధర స్వల్పంగా పెరడంతో మస్క్ బిలియనీర్స్ లిస్ట్‌లో తిరిగి 8వ ప్లేస్‌ను దక్కించుకున్నారు. ఈ నెలారంభంలో మస్క్ ప్రపంచంలోని రిచెస్ట్ బిలియనీర్స్‌లో 7వ స్థానంలో నిలిచారు.
