జనవరి 7వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీల ప్రకటన

జనవరి 7వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీల ప్రకటన
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్ తేదీలను జనవరి 17వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్రం విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ(సోమవారం) ట్విటర్‌లో పోస్టు చేశారు. జనవరి 1న జరిగే ‘లైవ్ డిస్కషన్ లో ఈ తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే చర్చలో ఐఐటీల్లో అడ్మిషన్ ప్రక్రియ, ప్రవేశ అర్హతల గురించి స్పష్టతనివ్వనున్నారు.ఈ విషయాన్ని పోఖ్రియాల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. లేటెస్టుగా JEE మెయిన్స్ 2021 పరీక్ష తేదీలను ప్రకటించారు. కరోనా కారణంగా JEE మెయిన్స్ 2020లో అర్హత పొందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయలేకపోయారు. దీంతో JEE అడ్యాన్స్ 2021లో నేరుగా పరీక్ష రాసేందుకు వారికి అవకాశం కల్పించారు. కరోనా కారణంగా పలు సాధారణ వార్షిక పరీక్షలు, జాతీయ ప్రవేశ పరీక్షలు జరగకపోవడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి చర్చించారు.