తిరుపతి జిల్లా చంద్రగిరిలో అర్థరాత్రి(ఫిబ్రవరి 13) ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించాయి. చంద్రగిరి మండలం యల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంటలు ధ్వంసం చేశాయి.. అంతటితో ఆగకుండా రైతు మనోహర్ రెడ్డిపై తీవ్రంగా దాడి చేశాయి. ఏనుగుల దాడిలో మనోహర్ రెడ్డి కుడి చేయి విరిగిపోయింది. దాడిలో గాయపడిన మనోహర్ ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
నెల రోజులుగా యల్లంపల్లిలో 18 ఏనుగుల గుంపు దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. రాత్రి సమయాల్లో ఒంటిరిగా వెళ్లాలంటే భయంగా ఉందని.. వాటివల్ల గ్రామం విడిచి వెళ్లిపోవాలని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్థులు. ఇకనైనా అధికారులు స్పందించి ఏనుగుల దాడి నుంచి తమను రక్షించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.