ఏనుగుల గుంపు.. పంటలన్నీ నాశనం

చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న గజ రాజులు.. మరోసారి పంటలపై విరుచుకుపడ్డాయి. ఇప్పటికే లక్షల విలువైన పంట ధ్వంసం కాగా.. తాజాగా చేసిన ఏనుగుల గుంపుల దాడిలో అనేక మామిడి, అరటి చెట్లు నేలకొరిగాయి.

వి.కోట మండలం ఎర్రినగేపల్లి గ్రామంలో  ఏనుగుల గంపు అరటి, మామిడి, వరి పంటల ధ్వంసం చేసింది. గత నెల రోజుల నుంచి ఏనుగుల గుంపు రైతులకు కంటతడి పట్టిస్తోంది. దాదాపు 13 ఏనుగుల గుంపు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు గుంపు లక్షల విలువైన పంటలు ధ్వంసం చేస్తున్నా ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ వాపోతున్నారు.

తమ పంటపొలాలపై గజ దాడులను రక్షించే వారే లేరా అని రైతులు కంట తడి పెడుతున్నారు. ఏనుగుల బారి నుండి తమ పంటలను కాపాడాలని రైతులు.. అధికారులను వేడుకుంటున్నారు. ఈ క్రమంలో ఏనుగుల గుంపును నియంత్రించడంలో, పంట, పొలాలను కాపాడడంలో అటవీ అధికారులు విఫలమయ్యారంటూ పలువురు విమర్శలు సంధిస్తున్నారు.